మెగాస్టార్ కోసం 'లూసిఫర్' స్క్రిప్ట్ సిద్ధం చేసిన సుకుమార్
on Feb 12, 2020
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి, ఆ మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించగా, మలయాళం ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన 'లూసిఫర్' మూవీ రీమే్‌లో ఆయన నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను సుకుమార్ పూర్తి చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి 'లూసిఫర్' సినిమా తెలుగులోనూ 2019 ఏప్రిల్‌లో రిలీజైంది కానీ, మన ప్రేక్షకుల్ని ఆకర్షించడంలో విఫలమైంది. మరో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హత్యకు గురైన ముఖ్యమంత్రి సన్నిహితుడిగా మోహన్ లాల్ నటించారు. ముఖ్యమంత్రి కూతుర్ని రక్షించుకొనే బాధ్యతను తీసుకొన్న అతడికి ఎవరి నుంచి సవాళ్లు ఎదురయ్యాయనేది ఈ సినిమాలోని ప్రధానాంశం.
ఈ సినిమా చిరంజీవికి బాగా నచ్చింది. తెలుగులో దాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన ఆశపడటంతో, దాని నిర్మాణ బాధ్యతను తీసుకుంటానని రాంచరణ్ మాటిచ్చేశాడు కూడా. డైరెక్టర్‌గా ఎవర్ని పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చినప్పుడు, తనకు 'రంగస్థలం' వంటి కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చిన సుకుమార్ పేరును చరణ్ సూచించడంతో, చిరంజీవి ఓకే అనేశారు. సుకుమార్‌ను చరణ్ సంప్రదించడం, సుకుమార్ 'లూసిఫర్'ను చూసి, చేస్తానని ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్టును తనదైన శైలితో సుకుమార్ తయారు చేశాడని తెలిసింది.
సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాడు. అది పూర్తవగానే, 'లూసిఫర్' రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నాడు. ఈలోగా కొరటాల శివ సినిమాని పూర్తి చేయనున్నాడు చిరంజీవి. మొత్తానికి ఈ ఏడాది దసరాకి చిరంజీవి, సుకుమార్ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కే అవకాశాలున్నాయని వినికిడి.
Also Read