Home

»

Latest News

మెగాస్టార్ చేతుల మీదుగా ‘ఆలోచన’ ట్రైలర్‌.. సీనియర్‌ సిటిజన్లకు ఉచిత టికెట్లు.!

Nov 23, 2026 11:39AM

సినిమా ప్రమోషన్లలో కొత్త కొత్త ఆలోచనలు చూస్తుంటాం. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంతో పాటు సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేకంగా ఉచిత టికెట్లు అందించాలనే నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘ఆలోచన’ సినిమా బృందం ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ‘ఆలోచన’ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 5:09 గంటలకు చిరంజీవి లాంచ్ చేయనున్నారు. 

ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. మెగాస్టార్ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల కానుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఈ సినిమా విడుదల సందర్భంగా 60 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు చిత్రబృందం ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. నవంబర్ 27, 28, 29 తేదీల్లో థియేటర్లలో ఉచితంగా సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ప్రేక్షకులు తమ ఆధార్‌ కార్డును చూపించి ఉచిత టికెట్లు పొందవచ్చని మేకర్స్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: భోగి ట్రైలర్‌లో శర్వా విశ్వరూపం.. ఐదుగురు చెల్లెళ్ల కోసం గంగ పోరాటం.!

సురేందర్ చాచా ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరించారు. నారాయణరావు, నరసింహరాజు, ప్రసాద్ బాబు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత వంటి సీనియర్‌ నటీనటులు ఇందులో కనిపించనున్నారు. బెన్నీ సుధాకర్‌ ఈ సినిమాతో నటుడిగా పరిచయం అవుతున్నారు.

యూ/ఏ సర్టిఫికెట్‌ పొందిన ‘ఆలోచన’ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ విడుదలతో సినిమా కథ, అందులోని పాత్రలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి మెగాస్టార్ చేతుల మీదుగా విడుదల కానున్న ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు: 
నిత్యా మేనన్‌ సంచలన నిర్ణయం.. అసలు కారణమిదే.!
డింపుల్ హయాతికి క్షమాపణలు చెప్పిన సంపత్ నంది.!

 

 

 

[Alochana Trailer, Megastar Chiranjeevi, Alochana Movie, Free Tickets, Senior Citizens]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com