చిరు 150లో ఫస్ట్ ఏం షూట్ చేస్తారో తెలుసా..?
on Jun 4, 2016
తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా తన కెరీర్లోనే మైల్ స్టోన్ కావాలనుకుంటున్నారు మెగాస్టార్. అందుకే కాస్త లేటైనా సినిమా ప్రీప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాకే షూట్ కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా జూన్ 15 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ చేశారు. అయితే ఎంత మెగాస్టార్ అయినా, ఇన్నేళ్ల గ్యాప్ వచ్చిన తర్వాత మళ్లీ యాక్టింగ్ లోకి ఈజీగా రావాలంటే కష్టమే. అందుకే ఆయనకు వార్మప్ లా, ఫైట్ సీక్వెన్స్ లను ముందు ప్లాన్ చేశాడట వినాయక్. టాలీవుడ్ లో డ్యాన్స్ లను, ఫైట్స్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి చిరంజీవి. సో తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన ఫైటింగ్స్ తోనే మొదటి షెడ్యూల్ ను మొదలెట్టడానికి చిరు కూడా సై అన్నారట. స్క్రిప్ట్ విషయానికొస్తే, మొత్తం యూనిట్ అందరికీ కథ బాగా నచ్చేసిందని, పూర్తి కాన్ఫిడెన్స్ తో షూట్ కు వెళ్తున్నామని మూవీ టీం చెబుతున్నారు. జనవరికి రిలీజ్ అయ్యేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసిన మూవీ టీం, డిసెంబర్ చివరికల్లా షూట్ పూర్తి చేసుకుని, వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి మెగా రీఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే, కొన్నాళ్లు ఓపిక పట్టాల్సిందే మరి.