Home

»

Latest News

మెగా హీరోల్లో మెగా బీజీ హీరో ఎవరు..?

Nov 18, 2016 10:21AM

టాలీవుడ్‌లో ఫ్యామిలీల్లో మెగా ఫ్యామిలీది ప్రత్యేక స్థానం..ఏ ఫ్యామిలీలో లేని విధంగా సుమారు ఎనిమిది మంది హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతమంది హీరోలున్నారు కదా.?? అందరూ సినిమాలు చేస్తున్నారా..? అంటే అవుననే చెప్పవచ్చు. అంతమందిలోనూ ఒక్క హీరోకి మాత్రం చేతుల నిండా పనే. అతను ఎవరో కాదు..మేనమామ పోలికలతో పాటు ఆయన మేనరిజాన్ని పుణికిపుచ్చుకొని వరుస సక్సెస్‌లు అందుకుంటున్న సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో విన్నర్ అనే మూవీ చేస్తున్నాడు..

ఆ సినిమా షూటింగ్ యూరప్‌లో శరవేగంగా జరుగుతోంది..దానితో పాటుగా కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న నక్షత్రంలోనూ సాయి స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇవే కాక ఈ హీరోకు పలువురు హీరోల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఖైదీ నెం 150 పూర్తయిన తర్వాత వివి వినాయక్ సాయితో ఓ మూవీ చేయాలని భావిస్తున్నాడట. మరో దర్శకుడు పూరీ జగన్నాథ్, అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనూ సినిమా ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com