Home

»

Latest News

హీరో టీకి డబ్బులిచ్చిన వాచ్‌మెన్..!

Nov 18, 2016 10:40AM

ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్ల రద్దు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నిర్ణయంతో సామాన్యులే కాదు ప్రముఖులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మొన్నామధ్య హీరోయిన్ బిపాసా బసు గుడ్డు కొనడానికి డబ్బుల్లేక చిల్లర అప్పు చేసింది. తాజాగా అలాంటి సమస్యనే ఎదుర్కొంది ఒక సినీ జంట. హీరో రాహుల్, గాయని చిన్మయిల జంట నోట్ల రద్దు వల్ల తమకు ఎదురైన ఇబ్బందిని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. నోట్లను రద్దు చేసినప్పుడు తాము యూఎస్‌లో ఉన్నామని, ప్రస్తుతం తమవద్ద చెల్లుబాటయ్యే కరెన్సీ లేదని చెప్పారు. ఇండియాలో ల్యాండ్ అవ్వగానే మా ఆయన రూ.100 డ్రా చేసుకొని దాంతో టీ తాగుదామని ఏటీఎం వద్దకు వెళ్లారు. అయితే ఉదయం 10 గంటలకు ఏటీఎంను లోడ్ చేస్తే రెండు గంటల్లోనే మొత్తం ఖాళీ అయిందని వాచ్‌మెన్ చెప్పారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే..ఆ వాచ్‌మెనే రాహుల్‌కి 20 రూపాయలిచ్చి టీ తాగమన్నాడు..అని చిన్మయి పోస్ట్ చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com