
సాయి థరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమా.. తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇటీవలే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు కన్ఫామ్ చేసింది చిత్ర యూనిట్. అయితే తాజా అప్ డేట్ ఏటంటే. ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. `జాలరి` అనే టైటిల్ ను ఈ సినిమాకు టైటిల్ గా పెట్టినట్టు ఫిలిం వర్గాల నుండి టాక్స్ వినిపిస్తున్నాయి. మరి దీని పై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించేంత వరకూ ఆగాల్సిందే.
కాగా ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా మనీషా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.






