
ప్రజంట్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం `దర్బార్`. మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. రజనీకాంత్ తో పాటు నయనతార ఇతర నటీనటులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ షూటింగ్ జరుగుతున్న సెట్స్ పైకి రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. ముంబై లోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో దర్బార్ షూటింగ్ జరుగుతోంది. అయితే కొన్ని రోజులు క్రితం దర్బార్ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అవడంతో ఈ పని స్టూడెంట్సే చేసుంటారని సెక్యూరిటీ టైట్ చేసారు. ఇక పై ఎలాంటి లీక్స్ జరగకూడదని స్టూడెంట్స్ ని కాలేజ్ కి రావొద్దంటూ సూచించారు. అయినా రజనీకాంత్ , నయనతార సెట్స్ లో ఉండటంతో చూడటానికి ప్రయత్నించారు స్టూడెంట్స్ . దీంతో సెక్యూరిటీ వారిని అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. దీంతో ఆవేశానికి లోనై విద్యార్థులు దర్బార్ సెట్స్ పైకి రాళ్లు విసరడం ప్రారంభించారట. అందరూ అప్రమత్తమవ్వడంతో ఎవరికి ఎలాంటి గాయలు జరగలేదని తెలుస్తోంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న డైరక్టర్ మురగదాస్ లొకేషన్ ను మార్చడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అభిమానం శృతిమించితే ఇలాగే ఉంటుంది కాబోలు.






