
'మనశంకర వరప్రసాద్ గారు'తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తన అప్ కమింగ్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. చిరుకి వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ని ఇచ్చిన బాబీ కొత్త చిత్రానికి దర్శకుడు కావడంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ అప్ డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ అద్భుతమైన బాణీలను సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక హై ఎనర్జీ మాస్ సాంగ్ చిత్రీకరణని చిత్ర బృందం విజయవంతంగా పూర్తి చేసింది. మెగాస్టార్ చిరంజీవి సిగ్నేచర్ మాస్ స్టెప్పులతో సాగిన ఈ పాట థియేటర్లలో అభిమానులకి, ప్రేక్షకులకి పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తమన్ అందించిన ఊరమాస్ బీట్స్‌కి చిరంజీవి తనదైన గ్రేస్, ఎనర్జీతో జతకలపడంతో షూటింగ్ సెట్స్ లోనే భారీ హంగామా నడిచింది. తమన్ మాస్ ఎనర్జీ, మెగాస్టార్ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ కలిసి సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ ఫీస్ట్‌గా నిలవనున్నాయి. వెంకట్ కె. నారాయణ నేతృత్వంలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'కేవీఎన్ ప్రొడక్షన్స్' ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. తెలుగు చిత్రసీమలో ఈ ప్రొడక్షన్ హౌస్‌కు ఇదే తొలి మూవీ. దీంతో బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోంది. మెగాస్టార్ ఇప్పటివరకు చేయని సరికొత్త వైవిధ్యమైన రోల్ లో కనిపించనుండగా మలయాళ స్టార్ నటి అనశ్వర రాజన్ కీ రోల్ పోషిస్తుంది.
Also read: పుష్ప 2 vs రాకా
chiranjeevi, bobby, mega 158, anaswararajan, kvn productions
.webp)






