Home

»

Latest News

'Mega 158' క్రేజీ అప్‌డేట్.. హైదరాబాద్ సెట్స్‌లో ఊరమాస్ హంగామా!

Jun 22, 2026 5:33PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మెగా 158' (Mega158) సినిమా అప్‌డేట్స్ ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే తమిళనాడులోని పొల్లాచ్చిలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కీలకమైన సన్నివేశాలతో కూడిన మొదటి షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. 

ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క రెండవ షెడ్యూల్‌ను భాగ్యనగరం హైదరాబాద్‌లో మేకర్స్ ప్రారంభించారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. "హైదరాబాద్‌లో #MEGA158 రెండవ షెడ్యూల్ ప్రారంభమై, అత్యంత వేగంగా సాగుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి షాట్‌ను ఒక అద్భుత దృశ్యంగా, ప్రతి సన్నివేశాన్ని ఒక పండుగలా మారుస్తున్నారు." అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ లొకేషన్లలో ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. మెగాస్టార్ కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు ఫెరోషియస్ అవతార్‌ను దర్శకుడు బాబీ ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై నిర్మాత వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే కేవీఎన్ ప్రొడక్షన్స్ టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ అనస్వరా రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా అనస్వరా రాజన్ ఈ సినిమాలో చిరంజీవి కూతురి పాత్రలో కనిపించబోతోందని ఇండస్ట్రీ టాక్. అలాగే 'కూలీ' ఫేమ్ రచితా రామ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు తెలుస్తోంది. 

సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ ఒక పక్కా వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోసం సరికొత్త మేకోవర్, లుక్ టెస్టులు నిర్వహించిన చిత్రబృందం, ఆయన కొత్త లుక్ లీక్ అవ్వకుండా సెట్స్‌లో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన సమయంలో దర్శకుడు బాబీ కొన్ని బీహైండ్ ది సీన్స్ (BTS) ఫొటోలను పంచుకున్నారు, కానీ అందులో ఎక్కడా చిరంజీవి లుక్ రివీల్ కాకుండా జాగ్రత్తపడడం అభిమానులలో మరింత క్యూరియాసిటీని పెంచింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో మెగాస్టార్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలకమైన టాకీ పార్ట్, కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com