Home

»

Latest News

రివ్యూలతో సినిమాని చంపేస్తారా? ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన డైరెక్టర్ 

Jun 22, 2026 5:24PM

 


కొత్త మూవీ మార్కెట్ లోకి వచ్చిందంటే సగటు ప్రేక్షకుడు ముందుగా ఆ మూవీ తాలూకు రివ్యూ చూడటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే రివ్యూ సంస్థలు ఉన్నట్టే ఈ జన్మ ఎత్తింది ఒక సినిమా నాశనం కోసమే అనేలా కావాలని రివ్యూ ఇచ్చే సంస్థలు ఉంటాయి. కొందరు రివ్యూల పేరుతో సినిమాని పూర్తిగా చంపేస్తున్నారనే ఆవేదన ఇండస్ట్రీ వర్గాల నుంచి  సైతం వ్యక్తమవుతు ఉంటుంది.
 
.ఈ క్రమంలోనే మలయాళ చిత్ర పరిశ్రమకి  చెందిన ప్రముఖ దర్శకుడు ఏబీ బినీల్(Ab binil)ఈ తీవ్రమైన అంశంపై నేరుగా రంగంలోకి దిగారు. కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్‌ని  కలిసి ఈ సినిమా రివ్యూల వివాదం, దాని వల్ల ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న నష్టాలపై అధికారికంగా ఫిర్యాదు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

సినిమా నిర్మాణం వెనుక ఎంతోమంది శ్రమ, కోట్లాది రూపాయల పెట్టుబడి దాగి ఉంటాయని దర్శకుడు బినీల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. థియేటర్లలో సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో వచ్చే మితిమీరిన ప్రతికూల విమర్శలు ప్రేక్షకులు థియేటర్లకి  రాకుండా అడ్డుకుంటున్నాయి. కేవలం వ్యూస్, లైక్స్ కోసం కొందరు వ్యక్తులు చేసే నెగెటివ్ ప్రచారం వల్ల సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ డిజిటల్ రివ్యూల వ్యవస్థపై ప్రభుత్వం తగిన నిఘా ఉంచి చిత్ర పరిశ్రమని  కాపాడటానికి కఠినమైన నిబంధనలు లేదా మార్గదర్శకాలను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

Also read: Transfer trimurthulu: 100 కథల్ని విని ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో వచ్చాడు.. మరి హిట్ కొట్టాడా!

ఈ అంశంపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ స్పందిస్తూ  చిత్ర పరిశ్రమకి  ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. రివ్యూల పేరుతో జరుగుతున్న బ్లాక్‌మెయిలింగ్ లేదా దుష్ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తాం. ఒక సినిమా విజయం లేదా అపజయాన్ని నిర్ణయించే పూర్తి హక్కు కేవలం సాధారణ ప్రేక్షకుడికి మాత్రమే ఉంటుందని, ఉద్దేశపూర్వకంగా సినిమాను దెబ్బతీసేలా చేసే నెగెటివ్ రివ్యూల ట్రెండ్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇక బినీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పొంగాల మూవీ కొన్ని రోజుల క్రితం విడుదలవ్వగా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అదే మూవీ ఇప్పుడు ఓటిటి వేదికగా అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com