
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'మెగా 158' (Mega158) రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ చిత్రం.. ప్రస్తుతం సరికొత్త షెడ్యూల్ కోసం తమిళనాడులోని అందమైన లొకేషన్ పొల్లాచ్చికి చేరింది.
ప్రస్తుతం పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు ప్రధాన తారాగణంపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, టాకీ పార్ట్‌ను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. వాల్తేరు వీరయ్యను మించిన ఒక ఊరమాస్, హై-వోల్టేజ్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని బాబీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ని మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో చూపించబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' (Peddi) సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొల్లాచ్చి షెడ్యూల్ సెట్స్ నుండి చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌కు, 'పెద్ది' చిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పొల్లాచ్చిలో షూటింగ్ లో ఉన్నప్పటికీ, తన మనసు అంతా పెద్ది చుట్టూనే తిరుగుతుందని చిరంజీవి రాసుకొచ్చారు.
అలాగే 'మెగా 158' సెట్స్ నుండి చిత్ర యూనిట్ కూడా ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. పొల్లాచ్చి షెడ్యూల్ సెట్స్ నుండి 'మెగా 158' టీమ్ మొత్తం రామ్ చరణ్‌కు, 'పెద్ది' చిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షల వీడియోను షేర్ చేసింది. మెగాస్టార్ సెట్స్ నుండి కొడుకు సినిమా విజయానికి ఇలా విషెస్ పంపడం సోషల్ మీడియాలో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలను హ్యాండిల్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కోసం విపరీతంగా జిమ్‌లో కష్టపడి తన బాడీని సరికొత్త మాస్ లుక్‌లోకి మార్చారు. పొల్లాచ్చిలో జరుగుతున్న ఈ భారీ షెడ్యూల్ మరో రెండు వారాల పాటు కొనసాగనుంది. తండ్రీకొడుకుల సినిమాలు ఒకే సమయంలో ఒక వైపు థియేటర్లలో రికార్డుల వేట, మరోవైపు సెట్స్ పై షూటింగ్ హడావిడితో సాగుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో మునిగిపోయారు.






