
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా టాలీవుడ్ తెరపైకి వస్తున్న సరికొత్త రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మారెమ్మ'. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. భారీ అంచనాల నడుమ 'మారెమ్మ' సినిమాను సెప్టెంబర్ 10న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
మోక్ష ఆర్ట్స్, ఆర్ట్ బీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించారు.
తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. రక్తం, నమ్మకం, త్యాగం కలబోతగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన విజువల్ అండ్ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది.

ఒక పల్లెటూరి నేపథ్యానికి చెందిన నెత్తుటి కథగా, విశ్వాసానికి, సంప్రదాయాలకు మధ్య జరిగే పోరాటంగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో మాధవ్ సరసన దీపా బాలు హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, వి.ఎస్. రూపలక్ష్మి, దయానంద్ రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతాన్ని అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా ప్రశాంత్ అంకిరెడ్డి, ఎడిటర్ గా సాయి బాబు తలారి వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ జానపద మూలాలు, పల్లెటూరి సంప్రదాయాలు, ఉద్వేగభరితమైన కథాంశంతో వస్తున్న 'మారెమ్మ' చిత్రం కొత్త తరం యాక్షన్ డ్రామాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 10, 2026న రాబోతున్న ఈ పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ రైడ్ థియేటర్లలో ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
Maremma Movie, Release Date, Maadhav Bhupathiraju, RaviTeja, Tollywood





