Home

»

Latest News

చెన్నై లవ్ స్టోరీకి ఆ విషయంలో అన్యాయం జరుగుతుందా.. ఎన్న నడక్క పొగుదు!

Jul 22, 2026 1:08PM

 


తమిళ సినీ ప్రియులకి తమిళ సినిమాలపై, హీరోలపై ఉండే అభిమానం, మోజు మాములుగా ఉండదు. విజయ్ తొలిసారి సిఎం కావడానికి ఆ సిన్సియర్ సినీ మోజునే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే జన నాయగన్ కి పోటీగా చెన్నై లవ్ స్టోరీ తో కిరణ్ అబ్బవరం థియేటర్స్ లోకి వస్తున్నాడు. జన నాయగన్ ఉరఫ్ జననాయకుడు జూలై 23న రిలీజ్ అవుతుంది.

విజయ్ వంటి మాస్ ఐకాన్ సినిమా విడుదలైతే చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకి  థియేటర్లు దొరకడం కష్టమవుతుందనే ఆందోళన టాలీవుడ్ వర్గాల్లో ముమ్మరంగా వ్యక్తమైంది. అయితే, కిరణ్ అబ్బవరం మరియు నిర్మాత ఎస్.కె.ఎన్ ఈ వివాదంపై పూర్తి స్పష్టతనిస్తూ, 'చెన్నై లవ్ స్టోరీ'కి ఎలాంటి అన్యాయం జరగదని గట్టిగా ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు చిత్రాల వెనుక ఉన్న పంపిణీ వ్యూహాలే ఈ నమ్మకానికి ప్రధాన కారణం. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ 'జననాయకుడు' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తుండగా, 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రాన్ని అగ్ర పంపిణీ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ ఇద్దరికీ అత్యంత బలమైన థియేటర్ నెట్‌వర్క్ ఉంది. రెండు పెద్ద నిర్మాణ సంస్థల మధ్య ఆరోగ్యకరమైన ఒప్పందం ఉండటం వల్ల ఏ ఒక్క సినిమాకు స్క్రీన్ల కొరత ఏర్పడకుండా తగినన్ని థియేటర్లు కేటాయింపు జరుగుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. 

Also read: ఫస్ట్ డే తెలుగులో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబడతాడా.. ముఖ్యంగా ఆ సినిమాని క్రాస్ చేస్తాడా! 

  చెన్నై లవ్ స్టోరీ  చెన్నై నగర నేపథ్యంలో ఇద్దరు తెలుగు యువతీ యువకుల మధ్య సాగే కథ. మొదట్లో చెప్పుకున్నట్టు తమిళ సినీ ప్రియులకి తమ సినిమాలపైనే కాదు తమిళ భాషపై, పేర్లపై విపరీతమైన మోజు. దీంతో చెన్నై లవ్ స్టోరీ లో ఉన్న చెన్నై పేరు కనపడటం ఆలస్యం, థియేటర్స్ లో తిష్ట వెయ్యడం గ్యారంటీ. మేకర్స్ కూడా హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియకి తమిళంలో మార్కెట్ ఉన్న దృష్ట్యా, తమిళ మార్కెట్ ని  దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించారు. దీంతో తమిళనాట థియేటర్స్ విషయంలో  అందరిలో ఉత్కంఠత నెలకొని ఉండటంతో పాటు, తమిళ ప్రేక్షకుల ఆదరణ విషయంలో కూడా  
 ఉత్కంఠత నెలకొని ఉంది.

chennai love story, vijay, jana nayakudu, 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com