'మా' మంచి వార్త చెప్తానంటున్న మంచు విష్ణు!
on Oct 21, 2021
సాధారణ ఎన్నికలను తలపిస్తూ జరిగిన 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'(మా) అధ్యక్ష పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విష్ణు.. 'మా'లో తన మార్క్ చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. 'మా'కు సంబంధించి రేపు(శుక్రవారం) ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.
'మా'కు సంబంధించి ఒక శుభవార్త చెబుతానని తాజాగా విష్ణు ట్వీట్ చేశారు. దాంతో ఆ గుడ్ న్యూస్ ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు ముందు 'మా'కు సొంత బిల్డింగ్ ను తన సొంత డబ్బులతో కట్టిస్తానని విష్ణు హామీ ఇచ్చారు. దీంతో విష్ణు చెప్పే ఆ గుడ్ న్యూస్ 'మా' బిల్డింగ్ కు సంబంధించినదా? లేక మరేదైనా ఉందా అనే చర్చలు నడుస్తున్నాయి.
ఇదిలా ఉంటే, మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన వారు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, వారి రాజీనామా లేఖలు ఇంకా అందలేదని, అందిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని విష్ణు అన్నారు.
Also Read