Home

»

Latest News

మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్ కటింగ్ చేసిన స్టార్ హీరో.. వీడియో వైరల్ 

May 26, 2026 5:15PM

వెండితెరపైనే కాదు నిజజీవితంలోను రియల్ హీరో అనిపించుకునే హీరోలని ఎంతో మందిని చూస్తుంటాం. ఆ కోవలోనే  నిరంతరం ప్రజాసేవలో మునిగితేలే ఒక హీరో , మరోసారి తనలోని గొప్ప మానవత్వాన్ని చాటుకుని అందరి హృదయాలని గెలుచుకున్నారు. 


రీసెంట్ గా రాక్ స్టార్ మంచు మనోజ్  రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌ ప్రాంతంలోని 'మాతృదేవోభవ' అనాథాశ్రమాన్ని  నిర్వాహకుల పిలుపు మేరకు సందర్శించాడు.  కేవలం పలకరింపులతో సరిపెట్టకుండా ఆశ్రమంలో నివసిస్తున్న వారి సౌకర్యార్థం డైనింగ్ టేబుళ్లు, కూర్చోవడానికి అవసరమైన కుర్చీలని,ప్రతి ఒక్కరికీ  దుస్తులని  పంపిణీ చేశారు. కొత్త బట్టలు అందుకున్న అక్కడి వారి ముఖాల్లో కనిపించిన ఆనందం, మనోజ్‌కు ఎనలేని తృప్తిని ఇచ్చింది. ఒక సెలెబ్రిటీగా కాకుండా, వారిలో ఒకడిగా కలిసిపోయి సమయం గడపడం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పర్యటనలో చోటుచేసుకున్న ఒక అనూహ్యమైన సంఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


Also read: Ranveer singh: బ్యాన్ విధించిన వేళ పవర్ ఫుల్ అమ్మవారి ఆలయంలో రణ్‌వీర్ సింగ్.. అసలు కారణం ఇదేనా!


ఆశ్రమంలో ఉన్న ఒక మతిస్థిమితం లేని వ్యక్తిని చూసిన మనోజ్, అతనికి తానే స్వయంగా హెయిర్ కటింగ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఏమాత్రం సంకోచం లేకుండా, ఒక సామాన్య వ్యక్తిలా మారిపోయి, చేతిలోకి కత్తెర తీసుకుని ఆ వ్యక్తికి చాలా ఓపిగ్గా హెయిర్ కటింగ్ చేసాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి పేరు సంతోష్ అని  కూడా ఎంతో ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అయితే అతనికి తన పేరు తప్ప మరే ఇతర వివరాలు, గతం గుర్తులేవని ఆశ్రమ నిర్వాహకులు మనోజ్‌కి  వివరించారు. దానికి స్పందించిన మనోజ్ "నీ పేరు చాలా బాగుంది బ్రదర్" అంటూ చిరునవ్వుతో అతనిని ఉత్సాహపరుస్తూ కటింగ్ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com