సోషల్ మీడియాలో తన విలక్షణమైన సినీ సమీక్షలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే మలయాళ ఫిల్మ్ క్రిటిక్ 'ఆరాట్టు అన్నన్' అలియాస్ సంతోష్ వర్కీ మరోసారి నెట్టింట దుమారం రేపాడు. ఈసారి ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన యంగ్ హీరోయిన్ మమిత బైజుపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ సెన్సేషన్‌గా మారింది.
ఈ విషయమై సోమవారం సంతోష్ వర్కీ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. మమిత బైజుపై తనకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని ఈ సందర్భంగా ఆయన కుండబద్దలు కొట్టినట్లు తెలిపాడు. తన జీవితంలో ఆమె తప్ప మరొకరిని ఊహించుకోలేనని, మమిత నటించిన చిత్రాన్ని ఇప్పటికే మూడుసార్లు చూశానని పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య వయసులో స్పష్టమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఆమె నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన తన పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ సినిమాపై చేసిన రివ్యూ ద్వారా రాత్రికి రాత్రే 'ఆరాట్టు అన్నన్'గా పాపులర్ అయిన సంతోష్ వర్కీ.. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన టాలెంటెడ్ నటి నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకుంటానని ప్రకటించి పెద్ద దుమారమే రేపాడు. ఆ సమయంలో నిత్యామీనన్ సైతం ఆయన తనను వేధిస్తున్నాడని మండిపడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే బాటలో మమిత బైజును టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
'ప్రేమలు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన మమిత బైజు.. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో సౌత్ నూతన సంచలనంగా దూసుకుపోతోంది. అలాంటి క్రేజీ హీరోయిన్‌పై ఒక వివాదాస్పద క్రిటిక్ ఇలా బహిరంగంగా పెళ్లి ప్రపోజల్ పెట్టడం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని కేవలం సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం చేసే పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం నటీమణుల వ్యక్తిగత విషయాలపై ఇలా మాట్లాడటం సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సంతోష్ వర్కీ తాజా ప్రకటనతో మమిత బైజు పేరు నెట్టింట మరోసారి మార్మోగుతోంది.
[Mamitha Baiju, Santhosh Varkey, Aarattu Annan, Premalu Actress, Telugu Movie Gossips]




