Home

»

Latest News

పగోడికి కూడా ఈ బాధ రాకూడదు. టాక్సిక్ ప్రొడ్యూసర్ వరుస మూడో ప్లాప్!

Sep 15, 2026 10:49AM

 


నిర్మాత.. తెలుగు సినిమా కింగ్ ఎవరు అనే విషయంలో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నిర్మాత నే కింగ్. కోట్లరూపాయలని పెట్టి నిర్మాత  సినిమా తెరకెక్కిస్తేనే ఎవరి టాలెంట్ అయినా నిరూపించుకొనే అవకాశం. అభిమానులు, ప్రేక్షకులు కూడా విజిల్స్ వేసేది. కానీ ఇప్పుడు ఆ నిర్మాత వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు. ఆయనే KVN ప్రొడక్షన్స్ అధినేత కే వెంకట సత్యనారాయణ.

ఈ శుక్రవారం(11sep ) బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ తో 'హైవాన్ 'అనే చిత్రం రిలీజయ్యింది.KVN నే బ్యానర్.  యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కగా భారీ డిజాస్టర్ దిశగా దూసుకెళ్తుంది. నార్త్ ప్రేక్షకులకి కధనం పెద్దగా రీచ్ అవ్వలేదనే టాక్ ట్రేడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తుంది. కలెక్షన్స్ కూడా చాలా డల్. నాలుగురోజులకి వరల్డ్ వైడ్ గా 12 .63 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. 2016 లో వచ్చిన మలయాళం మూవీ 'ఒప్పం' కి రీమేక్ గా తెరకెక్కింది. మోహన్ లాల్, సముద్ర ఖని కీ రోల్స్.  ఒప్పం తెరకెక్కించిన మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ నే దర్శకుడు. 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టుగా టాక్ 


దీంతో జననాయగన్, టాక్సిక్ తర్వాత హైవాన్  తో .KVN  ప్రొడక్షన్స్ మూడో డిజాస్టర్ ని అందుకోవడం టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం ఈ సంస్థ మెగాస్టార్ తో 'కాకా' ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  2021 లో కన్నడ సినిమా 'సాకేత్'  తో ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ జననాయగన్ కి ముందు కొన్ని చిన్న చిత్రాలని తెరకెక్కించింది.

 

 

 

[Kvn Productions, Haiwaan, Akshay Kumar, Sail Alikhan, Priyadarshan, Toxic, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com