Home

»

Latest News

Vijay: విజయ్ పై మాళవిక మోహన్ కీలక వ్యాఖ్యలు.. మాస్టర్ చేసావు కదా

May 16, 2026

 

 

మాళవిక మోహన్(Malavika Mohanan)జనవరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో రాజాసాబ్ లో చేసి మెప్పించింది. అందం, పెర్ ఫార్మెన్స్ ఒకదానితో ఒకటి పోటీపడేలా నటించడం మాళవిక స్పెషల్. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఇళయ దళపతి విజయ్(VIjay)పై కీలక వ్యాఖ్యలు చేసింది.


తాజాగా  ఇచ్చిన ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతు 'మాస్టర్'(Master)సినిమా షూటింగ్ సమయంలోనే  విజయ్‌ ని మొదటిసారిగా కలిసాను. మొదటి రోజే విజయ్‌తో  ఒక క్లిష్టమైన సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. దాంతో డైలాగ్స్ సరిగ్గా కుదురుతాయో లేదో అని  టెన్షన్ పడ్డాను. కానీ విజయ్ సర్  మాత్రం  ఎంతో ప్రశాంతంగా, కూల్‌గా కనిపించడం చూసి ఆశ్చర్యపోయాను. ఎంతటి కష్టమైన సీన్ అయినా సరే.. విజయ్ ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రతి విషయాన్ని చాలా నిశితంగా గమనిస్తూ పూర్తిగా పనిపైనే ఫోకస్ చేస్తారు .  తోటి నటీనటులకి  పూర్తి కంఫర్ట్ ఇస్తారు. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేసే స్వేచ్ఛని  విజయ్ ఇచ్చారు.అంతటి పెద్ద పొజిషన్‌లో ఉండి కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండటం ఆయనలోని గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం.

Also read: Ram charan: ముంబైలో చేతి బ్యాండేజ్‌తో కనిపించిన రామ్ చరణ్.. ఫ్యాన్స్‌లో టెన్షన్


ఉదయం 7 గంటలకి కాల్‌షీట్ ఉంటే, విజయ్ సరిగ్గా 6:55 నిమిషాలకే సెట్స్‌లో ప్రత్యక్షమవుతారు. అలాంటి అంకితభావం ఉన్న హీరోల వల్లే నిర్మాతలకు ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా సమయం కలిసి వస్తుంది.   విజయ్ లాంటి అద్భుతమైన డాన్సర్‌తో కలిసి 'మాస్టర్' సినిమాలో ఒక్క పాటలో కూడా డాన్స్ చేసే అవకాశం రాలేదనే రాలేదనే వెలితి మాత్రం అలాగే ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాళవిక మోహనన్  చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ 2021 లో రాగా చారులత అనే క్యారక్టర్ లో  మాళవిక మోహన్ అద్భుతమైన పెర్ఫార్మ్ తో మెప్పించింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com