Home

»

Latest News

సుక్కు సినిమా పై మ‌హేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు!!

Mar 5, 2019 10:22AM


 

`రంగ‌స్థ‌లం` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం తర్వాత ఎంతో మంది హీరోలు సుకుమార్ తో సినిమా చేయాల‌ని ఆరాట‌ప‌డ్డారు. రంగ‌స్థ‌లం అంత‌టి సంచ‌ల‌నం సృష్టించింది మ‌రి. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పంథా మార్చి సుకుమార్ క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఫుల్లుగా జోడించి రంగ‌స్థ‌లం చిత్రంతో త‌న స్టామినా ఏంటో మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇక దీంతో సుక్కుతో సినిమా చేయాల‌ని స్టార్ సైతం ఆశ ప‌డ్డారు. కానీ సుకుమార్ మాత్రం అంద‌ర్నీ కాద‌ని మ‌హేష్ బాబుతో సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ లో ఈ సినిమా రూపొంద‌నుందంటూ అధికారికంగా ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఇక మ‌హేష్ కొర‌కు సుకుమార్ క‌థ సిద్ధం చేస్తున్నాడు..త్వ‌ర‌లో సినిమా ప‌ట్టాలెక్క‌బోతుందంటూ ఎన్నో వార్త‌లు కూడా వ‌చ్చాయి. కానీ ఇంత‌లో అంద‌రూ షాక‌య్యేలా సుక్కు త‌న త‌దుప‌రి సినిమాను బన్నీతో ప్ర‌కటించాడు. అయితే ఈ విష‌యం పై స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టాడు మ‌హేష్ బాబు. అదేమిటంటే....``కొన్ని క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల సుకుమార్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయిందంటూ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాడు. అలాగే త‌ను చేయ‌బోయే కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్  చెబ‌తూ... త‌నతో `నేనొక్క‌డినే` సినిమా చేస్తూ ప్ర‌తి మూమెంట్ ఎంతో ఎంజాయ్ చేసాన‌ని..చెప్పుకొచ్చాడు మ‌హేష్‌. నిజంగా ఈ న్యూస్ సుకుమార్ కి ఎలా ఉందో కానీ, ఆయ‌న్ను ఇష్ట‌ప‌డే వారికీ, సినిమా వారికీ మాత్రం షాకింగ్ గానే ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com