Home

»

Latest News

నాకు హీరోయిన్ లేదు... పాటలు కూడా లేవ్!

Mar 4, 2019 3:45PM

ఎన్.ఎస్.జి. కమాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది సాయికుమార్ నటించిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. అయితే... సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి ముందు ఈ పాత్రలో నటించాలా? వద్దా? అని ఆలోచించడట! "లవర్ బోయ్ పాత్రల్లో నటించిన నాకు... ఈ ఎన్.ఎస్.జి కమాండో పాత్ర సెట్ అవుతుందా? లేదా? అని అనుకున్నా. నాన్నగారు ఈ తరహా పాత్రలు చాలా చేశారు. ఆయన కథ విని బాగుంటుందని చెప్పారు. నాకు లుక్ టెస్ట్ చేసిన తరవాత ధైర్యం వచ్చింది" అని ఆది సాయికుమార్ అన్నారు. అలాగే, తన సరసన సినిమాలో హీరోయిన్ ఎవరూ లేరనీ, తనకు పాటలు కూడా లేవని ఆయన తెలిపారు. హీరో అర్జున్ పండిట్ పాత్రకు హీరోయిన్ లేదు, పాటలు లేవు కనుక.. ఆది సాయికుమార్ ఈ పాత్రలో నటిస్తారా? లేదా? అని కంగారు పడ్డానని, కథ విని ఆయన సినిమా చేయడానికి అంగీకరించారని దర్శకుడు సాయి కిరణ్ అడివి అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా సోమవారం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. కాశ్మీర్ తీవ్రవాదం నేపథ్యంలో రూపొందిన సినిమా అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ మేళవించి సినిమా తీశానని అడివి సాయి కిరణ్ అన్నారు. 1980లలో కాశ్మీర్ పండిట్ కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని చర్చిస్తూ సినిమా చేశామని ఆది సాయికుమార్ అన్నారు. ప్రస్తుతం కాశ్మీర్ లో మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉండటం బాధాకరం అని ఆయన అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com