
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రియాంక చోప్రాకు మహేష్ బాబు తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు.
మహేష్ బాబు తన ట్వీట్‌లో ప్రియాంక చోప్రాను విష్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. "ఒకే ఒక్క మందాకినికి జన్మదిన శుభాకాంక్షలు.. పీసీ నీకు రాబోయే కాలం ఎంతో అద్భుతంగా సాగాలి.. నీకు నా ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయి, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి" అంటూ మహేష్ బాబు హార్ట్ ఎమోజీలతో తన ప్రేమను వ్యక్తపరిచారు.
ఈ ప్రత్యేకమైన పోస్ట్‌తో పాటు మహేష్ బాబు రెండు అద్భుతమైన ఫోటోలను కూడా షేర్ చేశారు. అందులో మొదటి ఫోటోలో ప్రియాంక చోప్రా ఎంతో పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తుండగా, రెండో ఫోటోలో ప్రకృతి ఒడిలో ఎంతో సరదాగా గాల్లోకి ఎగురుతూ కెమెరాకు చిక్కారు.
కాగా, మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో మందాకిని అనే పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తోంది.
Mahesh Babu, Varanasi Movie, Priyanka Chopra, Mandakini, SS Rajamouli





