మహేష్ షూటింగ్ అప్పుడు స్టార్ట్ అవుతుందట..!
on Jun 7, 2016
మహేష్ బాబు మురుగదాస్ ప్రాజెక్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ గా చెప్పచ్చు. సినీ జనాలందరి చూపూ ఈ సినిమాపైనే ఉంది. బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్ గా మిగిలిన నేపథ్యంలో, మహేష్ కు మురుగ ఎలాంటి కథ చెప్పి ఒప్పించాడన్నది ఆసక్తికరంగా మారింది. సౌత్ ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు సంపాదించిన మురుగదాస్ తో మహేష్ కాంబో అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మురుగ, జూలై 15 నుంచి షూటింగ్ డేట్ ఫిక్స్ చేశాడట. కుటుంబంతో ఫారిన్ లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ కూడా ఈ డేట్ కు ఓకే అన్నాడట. పాటతో సినిమాను మొదలెట్టనుండటం విశేషం. సూపర్ స్టార్ కోసం మురుగ బలమైన కథను సిద్ధం చేశాడని, ఖచ్చితంగా మహేష్ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని మూవీ వర్గాలంటున్నాయి. మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాను తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ఎనిమీ అనే పేరును పరిశీలిస్తున్నారు.