సూపర్ స్టార్ పుట్టినరోజున మహేష్ సినిమా ప్రారంభం..?
on Apr 10, 2016
మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ గా మురుగదాస్ తో సినిమా తెరకెక్కబోతోందని సినీవర్గాలంటున్నాయి. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమాతో మహేష్ బిజీగా ఉన్నాడు. మే 31 న సూపర్ స్టార్ బర్త్ డే. ఆ రోజునే మురుగదాస్ ప్రాజెక్ట్ ను మొదలెట్టి, తండ్రికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు మహేష్. కృష్ణ పుట్టిన రోజు మహేష్ కు సెంటిమెంట్. ఆ రోజు తన సినిమాకు సంబంధించి కనీసం ఫస్ట్ లుక్ ఉండేలా చూసుకుంటాడు. మురుగదాస్ తో చేయబోయే సినిమాకు పరిణీతి చోప్రాను తీసుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అని తెలుస్తోంది. త్వరలోనే పరిణీతి దీనిపై ఎనౌన్స్ చేస్తుందని అంటున్నారు. తెలుగు, తమిళంతో పాటు, బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను ఒకేసారి రిలీజ్ చేయాలనేది మురుగదాస్ ఆలోచన. కాగా బ్రహ్మోత్సవం మే 6 న హాళ్లలో సందడి చేయబోతోంది. ఈ నెల 24న తిరుపతిలో భారీ ఎత్తున ఆడియో రిలీజ్ ప్లాన్ చేశారు మూవీ టీం. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు.