మహేష్ బాబు సినిమాలో ఆ హీరోయిన్ ఉందా..?
on Mar 6, 2016
మహేష్ బాబు మురుగుదాస్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న దానిపై రోజుకో న్యూస్ వస్తోంది. ప్రస్తుతం, మురుగదాస్ ఒక బాలీవుడ్ భామను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఆమె ఎవరో కాదు, పరిణీతి చోప్రా. గతంలో ఎన్టీఆర్ సినిమాకు కూడా ఆమెను సంప్రదించినట్టుగా వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదంటూ పరిణీతి కొట్టిపడేసింది. లేటెస్ట్ గా మహేష్ తో నటించే అవకాశం ఉందంటున్నారు ఫిలింనగర్ జనాలు.
మహేష్ కూడా గతంలో ప్రీతి జింతా, బిపాసా బసు, లీసా రే లాంటి బాలీవుడ్ భామలతో రొమాన్స్ చేశాడు. సో ఈ టాక్ ను కొట్టి పారేయలేం. ఇప్పటి వరకూ సినిమాలో నేను శైలజ హీరోయిన్ కీర్తి సురేష్ ను తీసుకున్నారని, ప్రేమమ్ లో మలార్ పాత్ర చేసిన సాయి పల్లవిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. మరి వీటిలో ఏవి నిజమో కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు. ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత మరుగుదాస్ కాంబినేషన్లో సినిమా మొదలవనుంది.