Home

»

Latest News

నమ్రత కోరిక తీరుస్తున్న మహేష్ బాబు

Mar 5, 2011 11:34AM

Mahesh babu stills, Mahesh babu pics, Mahesh babu images, Mahesh babu wall papers   ప్రముఖ తెలుగు సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబుని బాలీవుడ్ సినిమాల్లో హీరోగా చూడాలన్నది అతని భార్య నమ్రత కోరిక. మహేష్ బాబు ఫేస్ కట్ గానీ, గ్లామర్ కానీ బాలీవుడ్ హీరోగా నూటికి నూరుపాళ్ళు సరిపోతాయని నమ్రత అభిప్రాయం. కానీ మహేష్ బాబు ఎందుకనో నమ్రత కోరికను మన్నించలేదు. అయినా మహేష్ బాబు చేత బాలీవుడ్ చిత్రాల్లో నటింపజేయాలని నమ్రత చాలా ప్రయత్నాలు చేసిందని వినికిడి.

అయినా నమ్రత మాటలను ఏనాడూ మహేష్ బాబు పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా, మణిరత్నం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మణిరత్నం హిందీలో కూడా తీస్తున్నాడట. ఈ విధంగా అనుకోకుండా భార్య నమ్రత కోరికను మహేష్ బాబు తీరుస్తున్నాడని తెలిసింది. ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు మరో హీరో విక్రమ్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తీస్తాడట మణిరత్నం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com