
భారతీయ ఇతిహాసాల్లో రామాయణానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తరతరాలుగా మనం వింటూ, చదువుకుంటూ పెరిగిన రామాయణం.. ఇప్పుడు వెండితెరపై అద్భుతమైన దృశ్యరూపంలో కనిపిస్తుంటే ఎవరికి మాత్రం సంతోషం కలగదు చెప్పండి. ముఖ్యంగా మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఇలాంటి ఇతిహాసాలు భారీ స్థాయిలో తెరకెక్కడం నిజంగా ఆనందించాల్సిన విషయమే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’ నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి వంటి ప్రముఖ నటీనటులు భాగమైన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాను ప్రశంసిస్తూ మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిన్నప్పటి నుంచి మనం వింటూ పెరిగిన కథలు ఇలా వెండితెరపై అందంగా ప్రాణం పోసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని మహేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా రణబీర్, యష్, సాయి పల్లవి అద్భుతంగా ఉన్నారంటూ ప్రశంసించారు. ఈ ముగ్గురి కాంబినేషన్ మ్యాజికల్‌గా ఉందని తన ఆనందాన్ని పంచుకున్నారు.
.webp)
అంతేకాదు.. ఇంత భారీ స్థాయి చిత్రాన్ని తెరకెక్కించడానికి నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీ చేసిన కృషిని కూడా మహేష్ అభినందించారు. సినిమా కోసం టీమ్ పడిన కష్టానికి హ్యాట్సాఫ్ చెబుతూ.. ‘రామాయణ’ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: ఫస్ట్ డే రామాయణ రికార్డు కలెక్షన్స్!
కాగా, మహేష్ బాబు తన అప్ కమింగ్ మూవీ 'వారణాసి'లో కాసేపు శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్నారు. అందుకే ‘రామాయణ’ సినిమాను ప్రశంసిస్తూ మహేష్ ట్వీట్ చేయడం మరింత ప్రత్యేకంగా మారింది.

మొత్తానికి ‘రామాయణ’కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో పాటు, సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకెన్ని ప్రశంసలు అందుకుంటుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
‘రామాయణ’ మూవీ రివ్యూ
అమెరికాలో మెగాస్టార్.. ‘కాకా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే.?
[Mahesh Babu Praises Ramayana, Ramayana Movie, Mahesh Babu Tweet, Ranbir Kapoor, Sai Pallavi, Yash, Ramayana, Nitesh Tiwari, Namit Malhotra, Varanasi Movie]






