Home

»

Latest News

ఐడియా సెల్యూలర్ కి మహేష్ బాబు

Mar 7, 2011 9:59PM

mahesh babu pics, mahesh babu images, mahesh babu stills, mahesh babu photos, mahesh babu wall papersఐడియా సెల్యులర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు మహేష్ బాబు అంగీకరించారని సమాచారం. మహేష్ బాబు ఇప్పటికే ఆరు ప్రోడక్టులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. గతంలో మహేష్ బాబు యూనివర్సెల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇప్పుడు ఐడియా సెల్యులర్ కంపెనీ మహేష్ బాబుకి ఉన్న ఫాలోయింగ్ ని చూసి మహేష్ బాబుని తమ ఐడియా సెల్యులర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారని తెలిసింది.

ఈ మధ్య మన రాష్ట్రంలో ఏ కంపెనీకి అయినా మాస్ అపీలున్న బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మహేష్ బాబు అని ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. అందుకే బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబుకి అంత డిమాండ్ ఏర్పడింది. మహేష్ బాబు ఇటీవల నటించిన "ఖలేజా" ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా మహేష్ బాబుకున్న డిమాండ్ కానీ, మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ కానీ ఏ మాత్రం తగ్గకపోవటం విశేషం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com