Home

»

Latest News

Athidhi 4K: మహేష్ అడ్డాలో 'అతిథి' కటౌట్ హంగామా.. రీ-రిలీజ్ రేంజ్ మామూలుగా లేదుగా!

May 22, 2026

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) బాక్సాఫీస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాత సినిమాలు థియేటర్లలోకి రీ-రిలీజ్ అవుతున్నాయంటే చాలు, అభిమానుల హడావుడి సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.  (Athidhi Re Release)

తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC X Roads) లోని ప్రముఖ ఫ్యాన్ ఫేవరెట్ థియేటర్ సుదర్శన్ వద్ద మహేష్ బాబు నటించిన 'అతిథి' సినిమాకు సంబంధించిన ఒక భారీ కటౌట్ ను ఆవిష్కరించారు. ఈ కటౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 

మహేష్ బాబు కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచిన ‘అతిథి’ చిత్రం 2007లో విడుదలై అభిమానులను అలరించింది. ఇప్పుడు దాదాపు 19 ఏళ్ల తర్వాత, ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా సరికొత్త 4K టెక్నాలజీతో థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి(మే 31)ని పురస్కరించుకుని.. మే 29న ఈ చిత్రం గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతోంది. 

ఈ సరికొత్త 4K రీ-రిలీజ్ వెర్షన్‌లో టెక్నికల్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. మునుపటి కంటే ఎంతో షార్పర్ విజువల్స్, క్రిస్పీ కలర్ గ్రేడింగ్‌తో పాటు థియేటర్లలో అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్ కోసం ‘డాల్బీ అట్మాస్’ ఆడియోను జోడించారు. అంతేకాకుండా, సినిమా రన్‌టైమ్‌ను మరింత క్రిస్ప్‌గా మార్చడానికి కొన్ని టైట్ ఎడిట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది.

మే 29న థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడటం ఖాయమని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఒక క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను థియేటర్లలో 4Kలో చూసేందుకు అటు సాధారణ ప్రేక్షకులు, ఇటు ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com