Home

»

Latest News

రామరాజు దర్శకత్వంలో ఇంకో సినిమా తీస్తాడట!

Jun 28, 2016 10:45AM

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలా చెప్పాడా? లేక నిజంగానో తెలియదు కానీ.. "ఒక మనసు" తర్వాత మళ్ళీ రామరాజు దర్శకత్వంలోనే మరో సినిమా నిర్మించనున్నాని ఎనౌన్స్ చేశారు దర్శకనిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి. ఆయన నిర్మాణ సారధ్యంలో రూపొందిన "ఒక మనసు" గత శుక్రవారం విడుదలై మిక్స్ టాక్ దక్కించుకొంది. ఆ తర్వాత మెగా అభిమానుల చొరవ వల్ల ఓ మోస్తరుగా ఆడుతోంది. సినిమా బోర్ కొడుతుందన్నారని ఓ 14 నిమిషాల సన్నివేశాలను కూడా తొలగించేశారు యూనిట్ సభ్యులు. సో, సోమవారం ఈ సినిమా కలెక్షను ఏమంత ఆశాజనకంగా లేవు. వేరే సినిమాల్లేక ప్రేక్షకులు నాని "జెంటిల్ మెన్" సినిమావైపే దృష్టి సారిస్తున్నారు. మరి రెడ్డి గారు "ఒక మనసు" ఫైనల్ రిజల్ట్ తో సంబంధం లేకుండా రామరాజుతో మరో సినిమా నిజంగానే మొదలెడతారో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com