.webp)
సమంత(Samantha)తన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం'(Maa Inti Bangaram)తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని సృష్టిస్తోంది. రికార్డులని సృష్టించడమే కాదు మరిన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు రావడానికి ఇన్ స్ప్రెషన్ గా నిలుస్తుంది.
కేవలం ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి తన సత్తాని చాలా బలంగా చాటుతుంది. ఈ మేరకు మేకర్స్ గోల్డెన్ రన్ అంటూ అధికారకంగా పోస్టర్ రిలీజ్ తో ప్రకటించారు. మొదటి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదటి రోజు ఇండియాలో5.35 కోట్ల నెట్ కలెక్షన్లతో శుభారంభం చేసిన ఈ చిత్రం, మౌత్ టాక్ తో శనివారం నాటికి 7.65 కోట్లు, ఆదివారం నాటికి ఏకంగా 10.10 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని అందుకుంది. వీకెండ్ ముగిసేసరికి ఇండియా గ్రాస్ వసూళ్లు 26.69 కోట్లకు చేరగా, ఓవర్సీస్ మార్కెట్లలో 14.60 కోట్ల గ్రాస్ సాధించి మొత్తంగా 41.79 కోట్ల గ్లోబల్ గ్రాస్ మార్క్ ను దాటింది. సోమవారం రోజు స్వల్పంగా తగ్గినప్పటికీ, రెండవ వారంలో అడుగుపెడుతూనే బాక్సాఫీస్ వద్ద 75.5% భారీ జంప్‌ను నమోదు చేయడం విశేషం. ఎనిమిదవ రోజు నాటికి 40.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
Also read: Trisha: ఆ వ్యక్తి దక్కకపోతే అసలు పెళ్లే చేసుకోను.. త్రిష సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)స్వయంగా ఈ చిత్రాన్ని వీక్షించి, చిత్ర యూనిట్‌ని ప్రత్యేకంగా అభినందించారు. జాయింట్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్‌ని నందినీ రెడ్డి డీల్ చేసిన విధానం మరియు చీరకట్టులో సమంత యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. సమంత, రాజ్ అండ్ డికె లతో కలిసి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే దిశగా దూసుకుపోతోంది.
.webp)




.webp)

