Home

»

Latest News

నా తల్లిదండ్రులకు రక్షణ ఇవ్వండి.. కలెక్టరేట్ మెట్లెక్కిన అనంత శ్రీరామ్!

May 25, 2026 6:17PM

- గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులకు ప్రాణభయం!
- తల్లిదండ్రుల కోసం రంగంలోకి దిగిన అనంత శ్రీరామ్
- భీమవరం కలెక్టరేట్‌లో ఫిర్యాదు!

ప్రముఖ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ (Anantha Sriram) కుటుంబం భూ వివాదంలో చిక్కుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ల్యాండ్ వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తమ స్వగ్రామంలో ఉన్న ఉమ్మడి ఆస్తి విషయంలో కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ, తన తల్లిదండ్రుల ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ ఆయన నేరుగా రంగంలోకి దిగారు. 

ఈ ల్యాండ్ వివాదం ముదరడంతో అనంత శ్రీరామ్ తన తండ్రితో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ జిల్లా కలెక్టర్ నాగరాణిని స్వయంగా కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్‌కు వివరిస్తూ న్యాయం చేయాలని కోరారు.

ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో అనంత శ్రీరామ్ కుటుంబానికి ఒక ఉమ్మడి స్థలం ఉంది. అయితే ఈ ల్యాండ్ ప్రస్తుతం కోర్టు వివాదంలో నడుస్తోంది. కోర్టు పరిధిలో ఉన్న ఈ ఉమ్మడి స్థలాన్ని, తమ కుటుంబ సభ్యుల అనుమతి గానీ, ఎలాంటి లీగల్ అప్రూవల్స్ గానీ లేకుండానే వేరే వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారని అనంత శ్రీరామ్ ఆరోపించారు. ఈ భూ కబ్జా యత్నాలతో దొడ్డిపట్లలోని తమ నివాసంలో ఉంటున్న వృద్ధులైన తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తమ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని అనంత శ్రీరామ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కేవలం మానసిక వేధింపులకే పరిమితం కాకుండా, తమ ల్యాండ్ వివాదాన్ని ప్రశ్నిస్తే ప్రాణాలకు కూడా హాని తలపెట్టేలా బెదిరింపులకు దిగుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తమ తల్లిదండ్రుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా తక్షణమే పోలీస్ రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ నాగరాణిని విజ్ఞప్తి చేశారు. ఆ కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

అనంత శ్రీరామ్ ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ నాగరాణి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ భూ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసిన వారిపై, అలాగే వృద్ధులను వేధిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను, పోలీసులను ఆదేశించినట్లు సమాచారం. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com