
దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్కీ భాస్కర్’ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రతీ ఒక్క సినీ అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ క్రేజీ సీక్వెల్‌పై దర్శకుడు వెంకీ అట్లూరి ఎవరూ ఊహించని బిగ్ అప్‌డేట్ ఇచ్చేశారు.
ప్రస్తుతం డైరెక్టర్ వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా 'లక్కీ భాస్కర్' సీక్వెల్ పై స్పందించారు. 'లక్కీ భాస్కర్' సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది వెంటనే మాత్రం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
'లక్కీ భాస్కర్ 2'కి ముందు ఆయన మరో రెండు సినిమాలు చేయనున్నారు. అందులో మొదటిది, కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో ఒక పవర్‌ఫుల్ కాప్ యాక్షన్ డ్రామా. ఇప్పటికే 'సార్' సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టిన ఈ కాంబినేషన్, ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది.
ఇక రెండో సినిమా విషయానికి వస్తే.. హాలీవుడ్ ఐకానిక్ క్లాసిక్ మూవీ 'హోమ్ అలోన్' శైలిలో ఉండే ఒక వినూత్నమైన 'చిల్డ్రన్స్ అడ్వెంచర్' మూవీని తెరకెక్కించబోతున్నారట.
మొదటి భాగాన్ని మించేలా 'లక్కీ భాస్కర్' పార్ట్-2 స్క్రిప్ట్ ఉండాలి కానీ, తొందరపడి ఏదో ఒక కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ క్రేజ్ దెబ్బతింటుంది. అందుకే, "స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకున్నాకే సెట్స్ పైకి వెళ్తాను" అని వెంకీ తేల్చి చెప్పారు.
కాబట్టి దుల్కర్ సల్మాన్ - వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రాబోయే ఈ క్రేజీ సీక్వెల్ కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఈ లోపే ధనుష్‌తో కాప్ యాక్షన్ మూవీ, అలాగే డిఫరెంట్ చిల్డ్రన్స్ అడ్వెంచర్ ఫిల్మ్‌తో మనల్ని అలరించడానికి వెంకీ అట్లూరి సిద్ధంగా ఉన్నారు.
Lucky Baskhar Sequel, Venky Atluri, Dulquer Salmaan, Lucky Baskhar 2






