Home

»

Latest News

కెరీర్ లో ఫ‌స్ట్ `హ్యాట్రిక్` కొట్టిన చైతూ!

Sep 25, 2021 2:37PM

అక్కినేని కుటుంబంలో మూడో త‌రం క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌.. ఇటీవ‌లే 12 ఏళ్ళ కెరీర్ ని పూర్తిచేసుకున్నాడు. ఈ పుష్క‌ర కాల ప్ర‌యాణంలో చెప్పుకోదగ్గ స్థాయిలో విజ‌యాలు చూసినా.. క‌థానాయ‌కుడిగా `హ్యాట్రిక్ హిట్` మాత్రం అందుకోలేక‌పోయాడు చైతూ. ఎట్ట‌కేల‌కు.. ఆ అంకం కూడా విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు ఈ అక్కినేని యంగ్ హీరో. త‌ను హీరోగా న‌టించిన గ‌త రెండు చిత్రాలు `మ‌జిలీ`, `వెంకిమామ‌`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న చైతూ.. తాజాగా విడుద‌లైన `ల‌వ్ స్టోరి`తో కెరీర్ లో ఫ‌స్ట్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు.  

గ‌తంలో.. `ఏమ‌యా చేసావె`, `100 % ల‌వ్`తో రెండు వ‌రుస విజ‌యాలు చూసినా `ద‌డ‌`తో హ్యాట్రిక్ మిస్స‌య్యాడు చైతూ. అలాగే `త‌డాఖా`, `మ‌నం`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్న‌ప్ప‌టికీ.. `ఆటోన‌గ‌ర్ సూర్య‌` నిరాశ‌ప‌ర‌చ‌డంతో వ‌రుసగా మూడో విజ‌యం మిస్స‌య్యింది. ఇలా.. రెండు సార్లు హ్యాట్రిక్ మిస్స‌యిన చైతూ.. ఎట్ట‌కేల‌కు `మ‌జిలీ`, `వెంకిమామ‌`, `ల‌వ్ స్టోరి`తో కెరీర్ లో తొలిసారి హ్యాట్రిక్ కొట్టి వార్త‌ల్లో నిలుస్తున్నాడు. మ‌రి.. కెరీర్ ప‌రంగా బెస్ట్ ఫేజ్ లో ఉన్న నాగ‌చైత‌న్య‌.. రాబోయే `థాంక్ యూ`, `లాల్ సింగ్ చ‌ద్ధా` (హిందీ - కీల‌క పాత్ర‌), `బంగార్రాజు` చిత్రాల‌తోనూ ఈ విజ‌య‌ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తాడేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com