Home

»

Latest News

'లెనిన్' మూవీ బుకింగ్స్ ఓపెన్.. అయ్యగారు హిట్ కొడతారా?

Jul 7, 2026 3:28PM

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin). మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో 'లెనిన్' చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.

థియేటర్లలో అఖిల్ అక్కినేని మాస్ జాతరను కళ్లారా చూసేందుకు అక్కినేని అభిమానులతో పాటు, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఈ సినిమాతో ఒక భారీ హిట్ కొట్టి, హీరోగా నిలదొక్కువాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్టే ఈ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉంది. ముఖంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి స్పందన లభిస్తోంది. 

అఖిల్ కెరీర్‌లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూలై 10న థియేటర్లలో బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమని అక్కినేని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి అఖిల్ ఆ నమ్మకాన్ని నిలబెడతాడేమో చూడాలి.

 

Akhil Akkineni, Lenin Movie, Bookings, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com