Home

»

Latest News

Lenin: రిలీజ్ కి ముందే 34 కోట్లు వసూలు చేసిన 'లెనిన్'.. దట్ ఈజ్ అఖిల్ 

Jul 7, 2026 3:27PM


అక్కినేని అఖిల్(Akhil)అప్ కమింగ్ మూవీ  'లెనిన్'(lenin)ఈ నెల 10 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మూడు సంవత్సరాల తర్వాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఇండస్ట్రీలోను, అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా  ఇప్పుడు బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు ఊహించని రీతిలో భారీ ధర పలికాయి.

అఖిల్ మార్కెట్ స్టామినాతో సంబంధం లేకుండా 'లెనిన్' చిత్రం ఏకంగా 34 కోట్ల నాన్ ది  యేట్రికల్ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇందులో శాటిలైట్, డిజిటల్ (ఓటీటీ), మరియు ఆడియో హక్కులు అన్నీ కలిపి ఉన్నాయని తెలుస్తోంది. 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద కేవలం 13 కోట్ల లోపే వసూలు చేసి తీవ్ర నిరాశ పరిచినప్పటికీ, 'లెనిన్' కథా బలం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు చూసి ప్రముఖ ఓటీటీ, శాటిలైట్ సంస్థలు పోటీ పడి ఈ హక్కులని  దక్కించుకున్నాయి. ఒక ప్లాప్ హీరో తదుపరి చిత్రానికి  34 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

also read: Bhagyaraj: బతికుండగా పట్టించులేదు.. ఇప్పుడు నెరవేర్చారు

కేవలం నాన్-థియేట్రికల్ పరంగానే కాకుండా, థియేట్రికల్ బిజినెస్‌లోనూ ఈ సినిమా జోరు చూపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏరియా థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అంటే దాదాపు 9 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు నైజాం, సీడెడ్, మరియు ఓవర్సీస్ హక్కుల బిజినెస్ కూడా ముగింపు దశకు వచ్చింది. నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై ఎంతగానో నమ్మకంతో ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'లెనిన్' సినిమా చివరి 40 నిమిషాలు అద్భుతమైన ఎమోషనల్ డ్రామాతో సాగుతుందని, థియేటర్లలో అఖిల్ క్యారెక్టర్ చూసి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే( Bhagyashri Borse)కథానాయికగా చేస్తుండగా మురళి కృష్ణ అబ్బూరి దర్శకుడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com