
అఖిల్ అక్కినేని(Akhil Akkineni)లెనిన్ తో సూపర్ హిట్ అందుకోవాలని కోరుకొని అభిమాని లేడు. ఆ అభిమానుల భావోద్వేగాల మధ్య లెనిన్ రిలీజ్ కావడం, సూపర్ హిట్ టాక్ అందుకోవడం జరిగింది. కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల గ్రాస్ వసూలు చెయ్యడంతో ఫ్యాన్స్ మొత్తం కాలర్ ఎగరేసుకొని ఫిగర్ తాలూకు ఇమేజ్ ని తమ ఫోన్ లో స్టేటస్ గా ఉంచుకున్నారు.
ఇక లెనిన్(Lenin)తో అఖిల్ తొలి సారి వంద కోట్ల క్లబ్ లోకి చేరబోతున్నాడని, అందుకు తగ్గ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. వాళ్ళు ఆందోళన చెందటానికి కారణం లేకపోలేదు. లెనిన్ గత శుక్రవారం 10 న రిలీజ్ అయ్యింది.మూడు రోజులకే 68 కోట్ల గ్రాస్ ని అందుకుంది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో కలెక్షన్ల గ్రాఫ్ కాస్త తగ్గుముఖం పట్టింది. నాల్గవ రోజు కేవలం 4.5 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి . వంద కోట్ల మార్కు అందుకోవడానికి 32 కోట్లు అవసరం.
also read: ప్రీతీ ముకుందన్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు.. ఆ అపర మేధావికి మునిమనవరాలు!
మరోవైపు నిన్న శుక్రవారం బాక్సాఫీస్ బరిలోకి కొన్ని సినిమాలు వచ్చాయి పైగా 'ఓడిస్సి, మూవీ కూడా తిష్ట వేసింది. అందుకే అభిమానుల్లో లెనిన్ వంద కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అనే టెన్షన్ లో మొదలైంది. మరి బాక్సాఫీస్ రేసులో 'లెనిన్' వంద కోట్ల క్లబ్ లో చేరుతుందేమో చూడాలి.
akhil, lenin, nagarjuna, nagavamsi
.webp)





