Home

»

Latest News

Lavanya Tripathi: కాస్టింగ్ కౌచ్‌పై మెగా కోడల సంచలన వ్యాఖ్యలు.. ఆ డైరెక్టర్ చేసిన పనికి ఏడ్చేశాను!

Mar 15, 2026

మెగా కోడలు, ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి మనసు విప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే 'కాస్టింగ్ కౌచ్' గురించి ఆమె షాకింగ్ విషయాలు వెల్లడించారు.

కరోనా సమయంలో లావణ్య ఒక తమిళ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే, ఆ సినిమా షూటింగ్ సమయంలో అక్కడి వాతావరణం, ముఖ్యంగా దర్శకుడి ప్రవర్తన ఆమెకు అస్సలు నచ్చలేదు. అక్కడ తనకు రక్షణ లేదని, అసౌకర్యంగా ఉందని అనిపించడంతో ఆమె ధైర్యంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.

సినిమా వదులుకున్న తర్వాత లావణ్యకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఆ చిత్ర బృందం ఆమెపై పగ తీర్చుకునే ప్రయత్నం చేసింది. పత్రికల్లో లావణ్య గురించి తప్పుడు వార్తలు రాయించారు. ఆమెపై కేసులు కూడా పెట్టారు. ఆ సమయంలో ఇండస్ట్రీలో ఎవరూ తనకు మద్దతుగా నిలవలేదని, ఒంటరిగా చాలా బాధపడ్డానని ఆమె తెలిపారు. "ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక చాలా సార్లు ఏడ్చేశాను" అని లావణ్య తన బాధను పంచుకున్నారు. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం ఆమె బయటపెట్టలేదు.

పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న మొదటి సినిమా 'సతీ లీలావతి'. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. 

ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com