Home

»

Latest News

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసిన యాంకర్ ఉదయ భాను!

Mar 15, 2026

తెలంగాణ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ప్రముఖ ఉదయ భాను కలిశారు. బీసి సామాజిక వర్గానికి చెందిన ఉదయ భాను తెలంగాణలో బలహీన వర్గానికి చెందిన అణగారిన మహిళల భవిష్యత్తు గురించి ప్రభాకర్ తో చర్చించారు. సినిమా రంగంలో, వ్యాపార రంగంలో మహిళలకు అవకాశాలు కలిపించాలని కోరారు. అంతేగాక వారికి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నపించారు. 

తన లాగే ఉదయ భాను మహిళలపై చూపిస్తున్న ప్రేమకి, వారికి మంచి చేయాలానే ఆమె ప్రయత్నానికి ప్రభాకర్ ఆకర్షితులయ్యారు. ఉదయ్ భాను ఆలోచనలని, తన అభిప్రాయాలని మెచ్చుకున్నారు. తప్పకుండా తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. 

ఇప్పటికే ఎంతోమందికి ప్రభుత్వం తరుపున ఇంకా స్వంతంగా ఎన్నో ప్రయోజనాలు అందించిన ఆయన, ఇక నుంచి మరింత అండగా ఉంటానని చెప్పారు. మహిళల పట్ల ఉదయ భానుకున్న ప్రేమపై ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆమెతో చర్చించారు.

తెలంగాణలో  వెనుకబడిన, అణగారిన మహిళల శ్రేయస్సు, సాధికారతపైన వారి చర్చ సాగింది. ముఖ్యంగా తదుపరి తరం మహిళలకు ఆత్మవిశ్వాసంతో, అవకాశాలతో, గౌరవంతో ఎదగడానికి మరింత బలమైన మార్గాలను ఎలా సృష్టించవచ్చో అనే దానిపైన ఉదయ భాను సుధీర్గంగా చర్చించారు. 

అణగారిన మహిళల కోసం ముందుకు వచ్చి, వారి సంక్షేమం కోసం ఉదయ భాను చేస్తున్న ప్రయత్నం అభినందనీయంగా మారింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com