తారక్, జక్కన్న.. సినిమాకో బ్యాక్ డ్రాప్!
on Oct 27, 2021
జట్టుకట్టిన ప్రతీసారీ హిట్టుకొట్టే కాంబినేషన్స్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబో ఒకటి. `స్టూడెంట్ నెంః 1`(2001), `సింహాద్రి` (2003), `యమదొంగ` (2007).. ఇలా హ్యాట్రిక్ సెన్సేషన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సక్సెస్ ఫుల్ కాంబో.. త్వరలో `ఆర్ ఆర్ ఆర్`తో సందడి చేయనుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్స్ లోకి రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తారక్, జక్కన్న ఎప్పుడు జట్టుకట్టినా ఏదో ఒక కొత్త బ్యాక్ డ్రాప్ తోనే ఎంటర్టైన్ చేస్తోంది. `స్టూడెంట్ నెంః 1` విషయానికి వస్తే ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందగా.. `సింహాద్రి` ఏమో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇక `యమదొంగ` సంగతే తీసుకుంటే.. ఇదో సోషియో ఫాంటసీ. అలాగే విడుదలకు సిద్ధమైన `ఆర్ ఆర్ ఆర్` మేటర్ లోకి వస్తే.. ఈ సినిమా ఓ హిస్టారికల్ ఫిక్షన్. సో.. ఎన్టీఆర్, రాజమౌళి ద్వయం సినిమాకో బ్యాక్ డ్రాప్ ని టార్గెట్ చేస్తోందన్నమాట. బ్యాక్ డ్రాప్ ఏదైనా.. తారక్, జక్కన్న కాంబో అంటేనే బాక్సాఫీస్ ఫేవరేట్. మరి.. భవిష్యత్ లోనూ ఈ సెన్సేషనల్ కాంబో.. ఇదే పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.