.jpg)
‘ఆలూ లేదు... చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం’ అనే సామేత గుర్తుందా? ఇంచుమించు అటువంటి సందర్భమే ఇది. ఐటమ్ సాంగుల స్పెషలిస్ట్ రాయ్ లక్ష్మీకి ఇంకా పెళ్ళి కాలేదు. ప్రేమలో ఉన్నట్టు ఎక్కడా ఆమె చెప్పలేదు. డేటింగులు గట్రా చేయడం లేదు. అయితే... రాయ్ లక్ష్మీ ప్రెగ్నెంట్ (గర్భవతి) అని ఓ వార్త గుప్పుమంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారామె. ‘నేను ప్రెగ్నెంట్ కాదయ్యో’ అంటూ ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రముఖ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ రాయ్ లక్ష్మీ ఇదే మాట చెబుతున్నారు. ఎందుకంటే.. రాయ్ లక్ష్మీ ఒక్క తెలుగులో మాత్రమే నటించడం లేదు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. అన్ని భాషల్లోనూ క్లారిటీ ఇవ్వాలి కదా మరి! తెలుగులో ‘నాగకన్య’గా విడుదలవుతోన్న తమిళ సినిమా ‘నీయ 2’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ప్రెగ్నెన్సీ పుకార్లపై రాయ్ లక్ష్మీ వివరణ ఇచ్చారు. మీరు ఎక్కడో విన్నది నిజమని నమ్మేస్తే ఎలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.






