Home

»

Latest News

అనుష్కపై దర్శకేంద్రుడి కామెంట్స్!

Jul 6, 2016 3:25PM

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పని చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఆయన సినిమాలో నటిస్తే తమకు క్రేజ్ రావడం ఖాయమని భావిస్తారు. ఆయన సినిమాలలో హీరోయిన్స్ ను అంత అందంగా చూపిస్తారు. అలాంటి రాఘవేంద్రరావు అందాల తార అనుష్క తన సినిమాలో ఎప్పుడు నటిస్తుందో.. అని ఎదురుచూసారట. ఈ విషయంపై ఆయనొక పోస్ట్ కూడా పెట్టారు. ''యే క్యారెక్టర్ అయినా చేయగలిగే అద్భుతమైన నటులలో అనుష్క ఒకరు. అది అరుంధతి అయినా, బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా తన పాత్రలకు తగ్గట్లు ఒదిగిపోతూ నటనతో అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది. ఎప్పటినుంచో తనకి నా సినిమా లో తగిన క్యారెక్టర్ వస్తే పనిచేయాలని చూస్తున్నాను. ఇన్నాళ్ళకి 'ఓం నమో వేంకటేశాయ' ద్వారా జరిగింది. తన కెరీర్ లో మొదటి సారి భక్తురాలి క్యారెక్టర్ చేస్తుంది. ఆ రోల్ లో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది మరియు కొత్తగా కన్పిస్తుంది. ఓం నమో వేంకటేశాయ లో అనుష్క నాగార్జున కి జంట గా నటించడం లేదు'' అని వెల్లడించారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com