
దర్శకుడు సంపత్ నంది, రామ్ చరణ్ కోసం కథ అనుకొని చాలా రోజులుగా ఎదురు చూశాడు. అయితే చరణ్ కు మాత్రం ఆ కథ చేయడానికి సమయం దొరకపోవడంతో వేరే హీరోతో చేయమని సంపత్ కు చెప్పేశాడు. దీంతో సంపత్, గోపిచంద్ ను తన సినిమాకు హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కేథరిన్ ను తీసుకోవాలని అనుకున్నారు. దీనికోసం ఆమెను సంప్రదించగా కథ నచ్చి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి కేథరిన్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవనుకున్న సమయంలో అల్లు అర్జున్ సరసన 'సరైనోడు' సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో మెరిసి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించడానికి ఒప్పుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుందీ భామ. ఇకనైనా.. కేథరిన్ ఆశించిన సక్సెస్ ను అందుకొని తెలుగులో తన హవా కొనసాగిస్తుందేమో చూడాలి..!






