ENGLISH | TELUGU  

అనసూయ డ్రెస్సింగ్‌పై కోట కామెంట్స్‌.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

on Oct 18, 2021

బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అన‌సూయ భ‌రద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఓ వైపు బుల్లితెరపై వరుస షోలు చేస్తూనే.. మరోవైపు వెండితెర పైనా అలరిస్తూ ఉంటుంది. అయితే షోలలో ఈమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ రచ్చ జరుగుతూ ఉంటుంది. అనసూయ డ్రెస్సింగ్ పై ఎవరో ఒకరు కామెంట్స్ చేయడం, దానికి ఆమె స్ట్రాంగ్ గా రిప్లై ఇవడం తరచుగా చూస్తుంటాం. అయితే ఇప్పుడు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ని తప్పుబట్టిన వారిలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చేరడం హాట్ టాపిక్ గా మారింది.

కోట శ్రీనివాసరావు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ డ్రెస్సింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో జబర్దస్త్ షో గురించి ప్రస్తావన రాగా.. ఏముంది అందులో? ఏదో బట్టలు వేసుకొని, నాలుగు డైలాగులు చెప్పడం తప్ప అని కోట అన్నారు. "ఇప్పుడు అనసూయ గారు ఉంది. మంచి నటి, మంచి డాన్సర్, మంచి పర్సనాలిటీ, చక్కని ఎక్స్ ప్రెషన్ అన్ని ఉన్నాయి. అలాంటి ఆవిడ ఆ షోలో వేసుకొనే డ్రెస్ నాకు నచ్చదు. అంత అందంగా ఉన్న ఆవిడ నార్మల్ డ్రెస్ వేసుకుంటే ప్రేక్షకులు ఎందుకు చూడరు?. అదే షోలో రోజా గారిని చూడట్లేదా?. అదొక్కటే అనసుయలో నాకు నచ్చదు" అని కోట కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే కోట కామెంట్స్ కి అనసూయ కౌంటర్ ఇచ్చారు. కోట పేరు ప్రస్తావించకుండా సీనియర్ యాక్టర్ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్ నా డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. ఎంతో అనుభ‌వ‌మున్న వ్య‌క్తి అలా మాట్లాడ‌టం బాధ క‌లిగించింది. ఒక‌రు ధ‌రించే దుస్తులు వారి వ్య‌క్తిగ‌తం. వృత్తిపరంగా కూడా అలా వేసుకోవాల్సి రావొచ్చు. అదంతా వారి వ్య‌క్తిగ‌తం. కానీ సోషల్ మీడియా ఇలాంటి కంటెంట్ ని హైలైట్ చేస్తుంది. ఆ సీనియర్ యాక్టర్ వెండితెర‌పై మందు తాగే, స్త్రీల‌ను కించ‌ప‌రిచే స‌న్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి సోషల్ మీడియా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. పెళ్లి అయ్యి పిల్లలున్న ఎందరో స్టార్స్ ఆన్ స్క్రీన్ పై హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నారు, షర్టు లేకుండా నటిస్తున్నారు. మరి వారిని ఎందుకు ఎవరూ ప్ర‌శ్నించ‌రు? పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్న మహిళను నా వృత్తిలో విజయం సాధించడానికి ఎంతో కష్టపడుతున్నాను. మీ వ్యక్తిగత అభిప్రాయాలను పబ్లిక్ లో చెప్పకుండా మీ పని మీరు చూసుకోండి." అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ అనసూయ ట్వీట్ చేశారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.