
ఎట్టకేలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్లాప్స్ కి మంగళగీతం పాడి కొరియన్ కనకరాజు తో హిట్ అందుకున్నాడు. హిట్ అందుకోవడమే కాకుండా తనలో దాగి ఉన్న యాక్షన్ మోడ్ ని బయటపెట్టి రచయితలకి కొత్త పని కల్పించాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీ నేపధ్యంలోతెరకెక్కగా యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి నిర్మించారు. వాళ్ళకి కూడా ఈ హిట్ చాలా అవసరం.
ఒక సినిమాకు నిజమైన పరీక్ష మొదటి వీకెండ్ పూర్తయిన తర్వాత వచ్చే సోమవారం రోజే ఎదురవుతుంది. సాధారణంగా వర్కింగ్ డేలలో వసూళ్లు తగ్గుతుంటాయి, కానీ కొరియన్ కనకరాజు మాత్రం సోమవారం నాటి 'మండే టెస్ట్'లో ఊహించని రీతిలో రికార్డు నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 4వ రోజైన సోమవారం ఒక్క రోజే బుక్‌మైషో (BookMyShow) మరియు డిస్ట్రిక్ట్ యాప్స్ (District Apps) ద్వారా ఏకంగా 70,000 కంటే ఎక్కువ (70K+) టిక్కెట్లు అమ్ముడవ్వడం చిత్ర యూనిట్ విజయాన్ని స్పష్టం చేస్తోంది. తెలంగాణ ప్రాంతంలో బోనాలు పండుగ సెలవు కలిసిరావడంతో థియేటర్ల వద్ద జనం పోటెత్తారు. దీనివల్ల వర్కింగ్ డేలో కూడా వీకెండ్ తరహాలోనే హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఆర్థిక పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాసింది. కేవలం 3 రోజుల మొదటి వీకెండ్‌లోనే బాక్సాఫీస్ వద్ద గ్లోబల్ వైడ్‌గా 37 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నివేదికల ప్రకారం శనివారంతో పోలిస్తే ఆదివారం 16.9 శాతం ఎదుగుదలతో . 4.85 కోట్ల నెట్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించుకుంది. స్రుమారు 38 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ వంటి నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే 26 కోట్లని రాబట్టుకుంది.
Also Read: రౌండ్ అప్.. పవన్ పై మహేష్ ట్వీట్ తో సరికొత్త చర్చ
ఈ సినిమా థియేట్రికల్ హక్కుల బిజినెస్ సుమారు 12 కోట్లుగా నమోదు కాగా, విడుదలైన కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకుని లాభాల బాటలోకి అడుగుపెట్టింది. అంటే నాల్గవ రోజు నుంచే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ప్రాఫిట్ షేరింగ్ ఫేజ్‌లోకి వెళ్లడం విశేషం. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం తన ప్రభావాన్ని చూపుతోంది. ఉత్తర అమెరికా (USA) బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 500 కే ($500K) డాలర్ల మైలురాయిని దాటి వసూళ్ల వేటను కొనసాగిస్తోంది. మొత్తం మీద విదేశాల్లో . 4 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం వరుణ్ తేజ్ కెరీర్‌కు మళ్లీ మంచి కమర్షియల్ బూస్ట్ ఇచ్చింది. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఉత్సాహంలో చిత్ర యూనిట్ ఘనంగా విజయోత్సవ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ గ్రాండ్ సక్సెస్ మీట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని, మండే టెస్ట్ పాస్ అయి, ప్రతిరోజు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగుతున్న 'కొరియన్ కనకరాజు' సుదీర్ఘ కాలం థియేటర్లలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
korean kanakaraju, Varun Tej, Chiranjeevi, Merlapaka Gandhi






