కథ రాస్తున్న కోన సిస్టర్
on Mar 17, 2020
ఫేమస్ రైటర్ కోన వెంకట్ సిస్టర్ నీరజా కోన గురించి ఆడియన్స్‌లో చాలామందికి తెలుసు. స్టయిలిస్ట్‌గా ఆమె సుపరిచితమే. సమంత, రకుల్, అనుష్క, రెజీనా, నితిన్, నాని, ఆది పినిశెట్టి తదితరులకు నీరజా కోన స్టయిలిస్ట్‌గా పని చేశారు. అయితే... ఆమెలో రచయిత కూడా ఉన్నారు. రెండు పాటలు రాశారామె. మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన ‘తిక్క’లో ‘తిక్క... తిక్క’ సాంగ్ రాసింది ఆవిడే. అలాగే, సందీప్ కిషన్ హీరోగా నటించిన, నిర్మించిన ‘నిను వీడని నీడను నేనే’ టైటిల్ సాంగ్ కూడా ఆవిడే రాశారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... నీరజా కోన సినిమా స్టోరీ రాస్తున్నారు. రెండేళ్ల నుండి ఒక కథపై వర్క్ చేస్తున్నారామె. త్వరలో కంప్లీట్ కావచ్చు. స్టోరీ వరకూ పరిమితం అవుతారో... డైరెక్షన్ కూడా చేస్తారో? ఇప్పుడే చెప్పడం కష్టం. ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్‌తో ఆమెకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి... మంచి కథ రాస్తే ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. ఎలాగో, అన్నయ్య కోన వెంకట్ ప్రొడ్యూసర్‌గా కూడా చేస్తున్నారు కాబట్టి నిర్మాత సమస్య కూడా ఉండదు.
Also Read