Home

»

Latest News

Kiran Abbavaram: థియేటర్ల పర్సంటేజీ గొడవ.. కిరణ్ అబ్బవరం షాకింగ్ రియాక్షన్!

May 14, 2026 4:25PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం థియేటర్ల రెంటల్ సిస్టమ్, షేరింగ్ పర్సంటేజీల వ్యవహారం ఒక రేంజ్ లో ముదురుతోంది. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఇండస్ట్రీని రెండు వర్గాలుగా విభజించింది. ఈ నేపథ్యంలో యువ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)కి ఈ వివాదంపై ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

సాధారణంగా ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే కిరణ్ అబ్బవరం, ఈ సెన్సిటివ్ ఇష్యూపై మాత్రం చాలా జాగ్రత్తగా స్పందించారు. రీసెంట్‌గా జరిగిన 'తిమ్మరాజుపల్లి టీవీ' ప్రెస్ మీట్‌లో మీడియా ప్రతినిధులు ఆయనను ఒక చిక్కు ప్రశ్న అడిగారు. "మీరు హీరో మాత్రమే కాదు, ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు కదా. మరి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు షేరింగ్ సిస్టమ్ ఇష్టమా లేక రెంటల్ సిస్టమ్ ఇష్టమా?" అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కిరణ్ అబ్బవరం ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతానికి ఈ వివాదంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని సున్నితంగా తిరస్కరించారు. అయితే మీడియా వదలలేదు.. "గత రెండు రోజులుగా ఇటు గిల్డ్ వాళ్లు, అటు తెలంగాణ ఎగ్జిబిటర్ల మధ్య ఇదే హాట్ టాపిక్ కదా.. మీరేం చెబుతారు?" అని మళ్ళీ ప్రశ్నించారు.

దీనికి కిరణ్ చాలా తెలివిగా సమాధానమిస్తూ.. "సార్, నన్ను వదిలేయండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను" అంటూ నవ్వుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ సమస్యను అడ్రెస్ చేసేంత నాలెడ్జ్ తనకు ఇంకా లేదని, పెద్దలు చూసుకుంటారనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కిరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి కిరణ్ అబ్బవరం ఇప్పుడు కేవలం నటుడు మాత్రమే కాదు, నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు. కాబట్టి ఈ సమస్య ఆయనకు కూడా భవిష్యత్తులో ఎదురయ్యేదే. కానీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తలకాయలు ఈ విషయంపై సీరియస్‌గా చర్చిస్తున్న తరుణంలో, తాను మధ్యలో దూరి అనవసర చిక్కులు కొని తెచ్చుకోవడం ఎందుకని ఆయన భావించి ఉండవచ్చు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com