
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటడానికి ఈ నెల 24 న 'చెన్నై లవ్ స్టోరీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతున్నాడు. అయితే ఈసారి కిరణ్ అబ్బవరం బాక్సాఫీస్ పోటీ కేవలం తెలుగు సినిమాలతోనే కాదు, ఏకంగా ఇళయ దళపతి విజయ్ నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ లాస్ట్ ఫిల్మ్ 'జన నాయగన్' (తెలుగులో 'జననాయకుడు') తో కావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు సినిమాలు జులై 24న థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తుండటంతో బాక్సాఫీస్ క్లాష్ అనివార్యంగా కనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్లతో పోటీ కిరణ్ అబ్బవరానికి కొత్తేమీ కాదు, గతంలో దీపావళి రేసులో శివకార్తీకేయన్ 'అమరన్' సినిమాతో పోటీపడి 'క' సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని తన సత్తా చాటాడు. ఇప్పుడు కూడా అదే జోష్‌తో తమిళనాట భారీ క్రేజ్ ఉన్న విజయ్ సినిమాని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు.
వ్యాపార పరంగా 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే మునుపెన్నడూ లేనంతగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా నాన్-థియేట్రికల్ అండ్ థియేట్రికల్ హక్కుల రూపంలో భారీ బిజినెస్ నమోదు చేసింది. కేవలం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఏకంగా 14 కోట్లు చెల్లించి సొంతం చేసుకోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా, సినిమా ఆడియో రైట్స్ ద్వారా దాదాపు 5 కోట్లు వచ్చాయని సమాచారం. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్ర ప్రాంతంలో 8 కోట్లు, నైజాం ఏరియాలో 8 కోట్లు, సీడెడ్ రీజియన్‌లో 3 కోట్లకు అమ్ముడుపోగా, ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా హక్కులు కలిపి 4 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ రకంగా థియేట్రికల్ పరంగానే 23 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగి కిరణ్ కెరీర్‌లోనే అత్యధిక రికార్డుగా నిలిచింది. ఓవరాల్‌గా 20 నుంచి 25 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, రిలీజ్‌కు ముందే 40 కోట్లకు పైగా టోటల్ బిజినెస్ పూర్తి చేసుకుని నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ అందించింది. ఈ విజయంలో నిర్మాత ఎస్కేఎన్, సాయి రాజేష్ కాంబినేషన్ యొక్క 'బేబి' సినిమా ఎఫెక్ట్ (10 కోట్ల బడ్జెట్‌తో 100 కోట్లు వసూలు చేసిన చిత్రం) కూడా బాగా ప్లస్ అయింది.
Also read: పక్క సీట్ లో టాప్ హీరోయిన్.. పట్టించుకోని యువకుడు
మరోవైపు, దళపతి విజయ్ నటిస్తున్న పొలిటికల్ డ్రామా 'జన నాయగన్' సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ నుంచి 12 కట్స్‌తో 'ఏ' సర్టిఫికేట్ లభించి క్లియరెన్స్ వచ్చింది. ఈ సినిమా బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ 'భగవంత్ కేసరి' చిత్రానికి అధికారిక రీమేక్ కావడంతో, తెలుగు నేలపై కిరణ్ అబ్బవరం కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ'కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తుండటంతో ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకుంటుండటం విశేషం. మరి ఈ భారీ బాక్సాఫీస్ పోరులో కిరణ్ అబ్బవరం తన విజయ పరంపరని కొనసాగిస్తాడో లేదో చూడాలి.
.webp)
.webp)






