Home

»

Latest News

పక్క సీట్ లో టాప్ హీరోయిన్.. పట్టించుకోని యువకుడు 

Jul 14, 2026 12:48PM

 

ఆమె అందరి లాంటి సామాన్యురాలు కాదు. ప్రపంచం మొత్తం తన కోసం వెయిటింగ్ చేసే టాప్ హీరోయిన్. ఆమెతో ఒక్క సెల్ఫీ కోసం గంటల తరబడి ఎదురుచూసే అభిమానులు ఎంతో మంది. కానీ తన పక్కనే కూర్చున్న ఒక యువకుడు ఒక్కసారి కూడా ఆమె వైపు చూడలేదు.

జర్మనీలోని ఓ మెట్రో రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తీసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ చిత్రంలో ప్రపంచ ప్రఖ్యాత ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌లో ఆర్యా స్టార్క్ క్యారక్టర్ లో  గుర్తింపు పొందిన మైసీ విల్లియమ్స్ ప్రశాంతంగా కూర్చుని ఉంది. ఆమె పక్కనే ఓ భారతీయ యువకుడు. అతని  ముఖంలో ఆందోళన, కళ్లలో నిద్రలేమి, భవిష్యత్తుపై అనిశ్చితి. ఆ ఫొటోలో కనిపించిన ఈ విరుద్ధ దృశ్యం చాలామందిని ఆలోచింపజేసింది. అతను ఎవరు అనే ప్రశ్నతో జర్మనీకి చెందిన ప్రముఖ పత్రిక డెర్ ష్పీగెల్ జర్నలిస్టులు అతడి కోసం వెతికారు. కొంతకాలం తర్వాత మ్యూనిక్‌లో అతడిని గుర్తించారు. అతను జర్మనీలో చట్టబద్ధమైన నివాస అనుమతి లేకుండా జీవిస్తున్న భారతీయ వలసదారు. జేబులో డబ్బు లేదు. టికెట్ కొనలేని పరిస్థితి. ప్రతిరోజూ రైళ్లలో తనిఖీలు జరుగుతాయేమోనన్న భయంతో ప్రయాణం. ఎప్పుడు పట్టుకుంటారో, ఎప్పుడు దేశం విడిచి వెళ్లమంటారో తెలియని ఆందోళన.


Also read: Akhil: అఖిల్ నెక్స్ట్ మూవీ అప్డేట్.. కథ జోనర్ ఇదేనా!

ఆ సమయంలో జర్నలిస్టు అతడిని ఒక ప్రశ్న అడిగాడు. “నీ పక్కన కూర్చున్నది మైసీ విలియమ్స్ అని తెలుసా? ఆమెతో ఒక ఫొటో కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఎదురుచూస్తారు. నువ్వు మాత్రం ఒక్కసారి కూడా ఆమె వైపు చూడలేదు. ఎందుకు అని అడిగాడు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్న ఆ యువకుడు చెప్పిన సమాధానం మాత్రం అందరినీ కదిలించింది. “నీ దగ్గర నివాస అనుమతి లేకపోతే… జేబులో ఒక్క యూరో కూడా లేకపోతే… ప్రతి రోజు భయంతో రైళ్లలో ప్రయాణిస్తుంటే… నీ పక్కన ఎవరు కూర్చున్నారు అనేది అసలు ముఖ్యం కాదు. ఆ ఒక్క వాక్యం ఆ వలసదారుడి జీవితాన్ని మొత్తంగా మార్చేసింది. ఆ సమాధానం ఆ పత్రిక జర్నలిస్టులను కదిలించింది. అనంతరం అతనికి నెలకు 800 యూరోల వేతనంతో పోస్టుమ్యాన్ ఉద్యోగం వచ్చేలా చేశారు. ఆ ఉద్యోగం ఆధారంగా చట్టబద్ధమైన నివాస అనుమతి కూడా లభించింది. ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలియదు గాని మైసీ విల్లియమ్స్, యువకుడి కథ సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com