క్రిష్‌పై కన్నేసిన మెగాస్టార్
on Jan 5, 2017
తన 150వ చిత్రం ఖైదీ నెం.150ని పూర్తి చేసి విడుదలకు రెడీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు చిరు అభిమానుల ఎదురు చూపులన్నీ ఆ సినిమాపైనే..సరే ఇదంతా బాగానే ఉంది..నెక్ట్స్ ఎంటీ..? 151వ సినిమా చేయాలనుకుంటున్నాడా..ఇక్కడితో ఆపేద్దామనుకుంటున్నాడా..? చేస్తే ఎవరితో చేస్తాడు.ఇలా లెక్కలెనన్ని ప్రశ్నలు చిరును టార్గెట్ చేశాయి. అయితే తన 151వ సినిమాపై ఎప్పుడో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశాడట చిరు. అందుకోసం చాలా కథలను విన్నాడట..ఈ నేఫథ్యంలో చిరు కన్ను క్రిష్‌పై పడింది.
బాలకృష్ణ 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ మూవీని చాలా అద్భుతంగా..చాలా వేగంగా తెరకెక్కించడంతో క్రిష్‌ను అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు. దీంతో తనకు కూడా మంచి కథను రెడీ చేయమని క్రిష్‌ను కోరాడట మెగాస్టార్. మరోవైపు హిందీలో అమీర్‌ఖాన్‌తో ఓ సినిమా చేసేందుకు క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు టాక్. మరీ అమీర్, చిరులలో క్రిష్ ఎవరికి ఓటేస్తాడో వేచి చూడాలంటున్నారు ఫిలింనగర్ జనాలు.