మెగాస్టార్ ఆటగా మారిపోయారు..?
on Jan 5, 2017
తన సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించి మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. ఆ పాత్రలు వేటికవే ప్రత్యేకం..అన్నిటిని కలిపి వీడియోగా చేయడం అసాధ్యమనిపిస్తుంది..కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కొందరు క్రియేటర్స్. మెగాస్లార్ పాత్రలతో ఒక అడ్వెంచరస్ వీడియో గేమ్‌ను డిజైన్ చేశారు. ఎం-యాప్ సోర్స్ డెవలప్మెంట్ అనే సంస్థ MEGA 150 పేరుతో దీనిని రూపొందించింది..దీనిలో ఖైదీ నిర్మాతలతో పాటు..ఇతర గేమ్ మేకర్స్ కూడా పాలుపంచుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ గేమ్ టీజర్ మెగా అభిమానులతో పాటు వీడియో గేమ్ లవర్స్‌కు బాగా నచ్చేసింది. ఈ గేమ్‌ను రెండు వాల్యూమ్స్‌లో రిలీజ్ చేస్తామని సదరు సంస్థ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లో ఈ గేమ్‌ను డౌన్లోడ్ చేసుకుని మరీ మెగాస్టార్‌తో ఆడుకోండి.